గత రెండు సంవత్సరాలుగా అట్టుడుకుతున్న లెబనాన్ దేశంలో ఎట్టకేలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ఆ దేశంలో యుద్ధం ముగిసి శాంతి దిశగా అడుగులు పడ్డాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ స్థానంలో పూర్తి స్థాయి సర్కారు ఏర్పాటుకు దేశ అధ్యక్షుడు జోసెఫ్ ఆమోదం తెలిపారు.
దీంతో ప్రధాని నవాఫ్ సలామ్, తన 24 మంది సభ్యుల మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. సరిహద్దుల కోసం ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని అమలు చేస్తామని, ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు ఆదేశ ప్రధాని సలామ్ హామీనిచ్చారు. మొత్తానికి మధ్యప్రాశ్చంలో శాంతి నెలకొంటుండంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.