ప్రియుడి కోసం తండ్రిని చంపిన కూతురు… కోడి కూరలో విషం కలిపి మరీ దారుణం !

-

హైదరాబాద్‌ లోని కుషాయిగూడ లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు కోసం ఏకంగా కన్న తండ్రిని సూపరీ ఇచ్చి చంపింది ఓ మైనర్ బాలిక. ప్రియుడి తో ప్రేమ వద్దన్నందుకు తండ్రిని మత్తు మందు ఇచ్చి చంపిన కూతురు. తండ్రి తినే కోడి కూర లో మత్తు మందు కలిపి సృహ కోల్పోయేలా చేసిన బాలిక…. తండ్రి రామకృష్ణ సృహా కోల్పోయిన తర్వాత ప్రియుడిని పిలిచి చంపించింది.

తండ్రిని చంపించేందుకు ప్రియుడితో కలిసి సుపారి గాంగ్ ను ఎంగేజ్ చేసింది ఆ బాలిక. సుపారీ గ్యాంగ్, ప్రియుడు, బాలిక కలిసి… తండ్రి రామకృష్ణ హత్య చేశారు. అయితే… రామకృష్ణ కుటుంబ సభ్యులు.. ఈ ఘటన పై కేసు బుక్‌ చేశారు. దీంతో రంగంలోకి దిగిన కుషాయిగూడ పోలీసులు…. రామకృష్ణ హత్య కేసును ఛేదించారు. మైనర్ బాలిక తో పాటు నలుగురిని అరెస్టు చేశారు కుషాయిగూడ పోలీసులు. ఈ ఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version