నాచారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది దీప్తి. తార్నాక ఐఐసిటిలో రీసెర్చ్ స్కాలర్ దీప్తి పని చేస్తోంది. ఐఐసిటి లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం ఓ వ్యక్తి నుంచి 15 లక్షలు తీసుకున్నాడట దీప్తి తండ్రి. అయితే… డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేయ లేకపోయాడు దీప్తి తండ్రి సంగీతరావు.
ఇక ఉద్యోగం ఇప్పించకా, డబ్బులు ఇవ్వక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు అనిల్. ఐజీ ఆఫీసులో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు అనిల్. ఇక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్థాపనకు గురి ఆత్మహత్య చేసుకుంది దీప్తి. అనిల్, వేధింపుల వల్లనే చనిపోయిందని దీప్తి తల్లి ఆరోపణ చేస్తోంది. ఇక నాచారంలో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.