ఉదయాన్ని పొలానికి వచ్చి పనిచేసుకుంటున్న రైతుకు తన పొలంలో భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. దీంతో ఒక్కసారిగా అతను వణికిపోయాడు. గట్టిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న రైతులు, ఇతరులు అక్కడకు వచ్చారు. కొండచిలువను చూసి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న క్యాచర్ చాకచక్యంగా కొండచిలువను బంధించాడు.
ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంగపాలెంలో రైతు పొలంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. సుమారు 8 అడుగుల మేర కొండచిలువ ఉన్నట్లు సమాచారం. కొండచిలువను చాకచక్యంగా సంచిలో బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో స్నేక్ క్యాచర్ వదిలి వేయడంతో అక్కడి రైతులు, వ్యవసాయ కూలీలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంగపాలెంలో రైతు పొలంలో 8 అడుగుల కొండచిలువ…
👉భయబ్రాంతులకు గురైనా కూలీలు, వెంటనే ఫారెస్ట్ స్నేక్ క్యాచర్‌కు సమాచారం
👉కొండచిలువను చాకచక్యంగా సంచిలో బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిన స్నేక్ క్యాచర్
For More Updates Download The App… pic.twitter.com/cFo6E7foO0— ChotaNews App (@ChotaNewsApp) January 7, 2025