రేవంత్ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ పై అక్రమ కేసులు : హరీశ్ రావు

-

కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ నివాసంలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయవాదులతో చర్చించడం జరుగుతుంది. రేవంత్ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగానే కేటీఆర్ పై అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. అన్ని సర్వేల్లో కూడా ముఖ్యమంత్రి ఫెయిల్, ప్రభుత్వ ఫెయిల్ అని తెలుస్తోంది. తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమైనది.

 

ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు, అరెస్టులతోనే ప్రభుత్వం తప్పులను కప్పి పుచ్చుకోవాలనుకుంటున్నాడని తెలిపారు. విచారణ కొనసాగించడానికే హైకోర్టు తీర్పు వెల్లడించింది. తప్పు జరిగిందని హైకోర్టు తెలపలేదు. విచారణకు సహకరిస్తామని తెలిపారు. అవినీతి జరగలేదు.. గ్రీ న్ కో కంపెనీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజల దృష్టి మరల్చడానికే ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు అప్పీలుకు పోవాలా..? లేదా అనేది న్యాయవాదుల సలహా మేరకు మేము నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news