చెన్నైలో దారుణం జరిగింది. గంజాయి స్మగ్లింగ్ వార్తలను ప్రసారం చేసాడు అని ఒక జర్నలిస్ట్ ని దారుణంగా హత్య చేసారు. తమిళనాడులో గత కొన్ని రోజులుగా గంజాయి మాఫియా పెరిగిపోతుంది. ఆదివాసి ప్రాంతాల్లో ఈ మాఫియా కాస్త ఇబ్బంది పెడుతుంది. దీనితో అక్కడి మీడియా కూడా ఎక్కువగా ఈ మాఫియ మీద ఫోకస్ చేసింది. ఇక ఈ మాఫియా విషయంలో ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది.
ఒక ఛానల్ రిపోర్టర్ మౌన్సాస్ గంజాయి మాఫియాపై స్టింగ్ ఆపరేషన్ చేసాడు. పదే పదే వార్తలు ప్రసారం చేసాడు. దీనితో అతని మీద కక్ష పెంచుకున్నారు. మాట్లాడాలి అని అతన్ని పిలిచారు. అక్కడికి వెళ్ళగా కత్తితో దాడి చేసి చంపేశారు. ఈ ఘటనలో అతని ఒంటి మీద 18 కత్తి పోట్లు ఉన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.