ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి కి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. ఆయనపై సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా జైలుకు వెళ్లనున్న గుంటూరు సీఐడీ పోలీసులు.. పీటీ వారెంట్‌పై పోసానిని వర్చువల్‌గా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇప్పటికే అన్ని కేసుల్లో పోసానికి బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే….. నేడు పోసాని కర్నూలు జైలు నుంచి విడుదల పై ప్రతిష్టంభన చోటు చేసుకుంది. పోసాని పై పీటి వారెంట్ వేశారు గుంటూరు సిఐడి పోలీసులు. కర్నూలు జిల్లా జైలుకు పిటి వారెంట్ తో రానున్నారు గుంటూరు సిఐడి పోలీసులు. పీటీ వారెంట్ పై కోర్టు లో హజరుపర్చనున్నారు సిఐడి పోలీసులు. కర్నూలు జైలు నుంచే ఆన్ లైన్ లో జడ్జి ఎదుట హజరుపర్చనున్నారు సిఐడి. ఇప్పటికే అన్ని కేసులలో పోసాని కి బెయిల్ వచ్చింది. తాజాగా సిఐడి పీటి వారెంట్ తో పోసాని విడుదల పై స్పష్టత రావడం లేదు.