ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారు జామున ద్విచక్రవాహనాన్ని ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
ఈ ఘటన ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీని ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు, అంబులెన్స్కు స్థానికులు సమాచారం అందించినట్లు సమాచారం. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.