తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. షబ్బీర్ అలీ కారు డ్రైవర్ వేరే కారును తప్పించాలనుకున్నాడు. కానీ అనూహ్యంగా డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో షబ్బీర్ అలీ కారులో లేకపోవడంతో అతనికి అపాయం తప్పింది.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సభ స్థల పరిశీలన చేసేందుకు వచ్చిన మంత్రుల బృందంతో కలిసి ఆయన కామారెడ్డికి చేరుకున్నారు. షబ్బీర్ ఆలీ అక్కడికి చేరుకున్న అనంతరం ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కారును పక్కకు తీసి వివరాలను తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. షబ్బీర్ ఆలీ కారు డ్రైవర్ కూడా ప్రమాదం నుంచి బయటపడినట్లుగా తెలుస్తోంది. కాగా షబ్బీర్ అలీ ఈరోజు కామారెడ్డి లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తన నియోజకవర్గమైన కామారెడ్డిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు షబ్బీర్ అలీ పర్యటిస్తున్నారు.