తాన్య మిట్టల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె హిందీ బిగ్ బాస్ 19 కంటెస్టెంట్. బిగ్ బాస్ షోలో తనదైన ఆటతీరుతో ఈ బ్యూటీ ఎంతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ షో తర్వాత అనేక సినిమాలలో, సిరీస్ లలో అవకాశాలను సొంతం చేసుకుంది. తాజాగా తాన్య మిట్టల్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీస్తోంది. తాన్య తన ఇల్లు సేవన్ స్టార్ హోటల్ కన్నా ఎంతో బాగుంటుందని తన ఇంటి ముందు ఏ స్టార్ హీరో హీరోయిన్ల ఇల్లులు కూడా పనికిరాదన్న విధంగా కామెంట్లు చేసింది.

తాను ఇంట్లో, బయట ఎప్పుడు చీరలోనే ఉంటానని బాత్రూమ్ లో కూడా అలాగే ఉంటానని తాన్య హాట్ కామెంట్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఐశ్వర్యరాయ్ కన్నా ఎంతో బ్యూటిఫుల్ గా క్యూట్ గా ఉంటానని చెప్పిన ఓ వీడియో వైరల్ గా మారుతుంది. ఈ వీడియోను చూసిన చాలామంది ఐశ్వర్యరాయ్ తో నీకు పోలిక ఏంటి అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. తన అందం ముందు నువ్వు ఎంత అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు.