సంక్రాంతి పండుగ నేపథ్యంలో సరదగా బిల్డింగ్ ఎక్కి గాలిపటం ఎగరేసిన వ్యక్తి అనుకోకుండా ప్రమాదానికి గురయ్యాడు. గాలిపటాన్ని పైకి తీసుకువచ్చే క్రమంలో వెనక్కి వెళ్లి పై నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
నరేందర్ అనే వ్యక్తి నిన్న సరదాగా గాలిపటాలు ఎగురేవేశాడు. వారి నివసించే బిల్డిండుకు సైడ్ వాల్స్ లేవని తెలుస్తోంది. కైట్ ఫ్లై చేస్తూ తాను ఎక్కడ ఉన్నాననేది చూసుకోకుండా వెనక్కి వెళ్లడం వల్లే ప్రమాదం సంభవించినట్లు సమాచారం. కింద పడి గాయాలైన నరేందర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయం అవడం వల్లే అతనికి మరణం సంభవించినట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది.