తిరుపతిలో రూ.1,500 కోసం వ్యక్తి దారుణ హత్య..

-

ఏపీలోని తిరుపతి జిల్లాలో రూ.1,500 కోసం వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం..కలికిరి గ్రామానికి చెందిన మహబూబ్ సాహెబ్, అజ్మతుల్లా స్థానిక ప్రియదర్శిని వెజిటెబుల్ మార్కెట్‌లో కూరగాయాల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తోటి వ్యాపారి మహబూబ్ సాహెబ్ నుంచి రుద్ర రూ.1,500 అప్పుగా తీసుకున్నాడు.

ఆ తర్వాత తిరిగి చెల్లించే క్రమంలో రుద్ర సరిగా స్పందించకపోవడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఈ ఘటనలో కోపోద్రిక్తుడైన రుద్ర తన కుమారుడు, అనుచరులతో మార్కెట్‌కు వచ్చేసరికి మహబూబ్ సాహెబ్ అక్కడ లేకపోవడంతో అజ్మతుల్లాపై రుద్ర, అతని అనుచరులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాల పాలైన అజ్మతుల్లా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదంతంతో మార్కెట్‌లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version