ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి జరిగింది. గాంధీ గ్రామం పంచాయతీ సిటిజన్ కాలనీలో నివాసం ఉంటున్న గోకాడ సూర్యనారాయణ ఇటీవల తన స్వగ్రామం బయలుపూడికి వెళ్తుండగా మార్గ మధ్యలో నలుగురు వ్యక్తులు అతనిపై దాడి పాల్పడ్డారు.
దీంతో ఆయన్ను చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, చికిత్స పొందుతున్న సూర్యనారాయణపై ఆసుపత్రిలో మరోసారి దాడి జరిగినట్లు సమాచారం. 8 మంది వ్యక్తులు ఆయన్ను బయటకు లాక్కొచ్చి మరీ దాడి చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, బాధితుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.కాగా, ఎందుకు దాడి చేశారనే విషయం తెలియరాలేదు.
అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి
గాంధీ గ్రామం పంచాయితీ సిటిజన్ కాలనీలో నివాసం ఉంటున్న గోకాడ సూర్యనారాయణ
ఇటీవల తన స్వగ్రామం బయలుపూడికి వెళ్తుండగా మార్గ మధ్యలో సూర్యనారాయణపై నలుగురు వ్యక్తులు దాడి
చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న… pic.twitter.com/li21SqDUje
— BIG TV Breaking News (@bigtvtelugu) March 2, 2025