పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నిషాపై దాడి యత్నంలో కొత్త ట్విస్ట్

-

హైదరాబాద్ పంజాగుట్టలో నిషా అనే మహిళపై దాడి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో అనేక నిజాలు బయటపడుతున్నాయి. గతంలోనే నిషా పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. ఓ ఎమ్మెల్యే అనుచరుడు విజయ్ సింహ తనను వేధించాడని, తనపై కత్తితో దాడి చేశాడని నిషా ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేశారు.

గొలుసు దొంగలు-పోలీసులదాడి

అయితే సంఘటన జరిగిన రోజు తెల్లవారి జామున నుంచి 9 గంటల వరకు సూరజ్ కుమార్, నందకుమార్ అలియాస్ నందుతో దాదాపు 30 సార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. నందకుమార్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వద్ద పిఎగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సంఘటనకు ముందు ఇద్దరి మధ్య వాట్సప్ కాల్స్ గుర్తించారు పోలీసులు. విజయసింహ కేసులో ఇరికించేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే నెల రోజుల క్రితమే స్కెచ్ వేసినట్లు.. సూరజ్, నంద కుమార్ ల మధ్య వందల ఫోన్ కాల్స్ గుర్తించారు.

నిషా ఆసుపత్రి బిల్లు చెల్లించాడు అబ్రర్. ఘటన జరిగినట్లు చెబుతున్న సమయంలో అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన జరిగి గాయాలు లేవని తేలిన తర్వాత నిషా, సూరజ్ పరారయ్యారు. పరారీలో ఉన్న నిషా బాడుగు, నిహారిక, కమలగా అవసరానికి అనుగుణంగా పేర్లు మార్చుకున్నట్లు గుర్తించారు. కుట్ర వెనక ఉన్న మాస్టర్ మైండ్ ని గుర్తించేందుకు పక్కాగా ముందుకు వెళుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version