చిప్స్ ప్యాకెట్ చిన్నారి ప్రాణం తీసింది..!

-

పిల్లలకు ఏదైనా కొనివ్వడానికి షాప్ కి తీసుకెళ్ళాము అంటే చాలు.. ఏది కలర్ ఫుల్ గా కనిపిస్తే అది కొనివ్వాలి అంటూ పిల్లలు మారాం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పిల్లలు మారాం చేశారు కదా అని ఏది పడితే అది కొనిస్తే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ ఏకంగా తల్లిదండ్రులు తమ కూతురు కొనిచ్చిన చిప్స్ ప్యాకెట్ వల్ల ఏకంగా చిన్నారి ప్రాణం పోయింది. ఘటన విజయనగరం జిల్లాలోని గిరిజన పల్లెలో చోటు చేసుకుంది

సంధ్య అనే మహిళ తన కుమార్తె కోసం క్రాక్స్ రింగ్ ప్యాకెట్ తీసుకు వచ్చింది. ఈ ప్యాకెట్లు ఫ్రీ గా చిన్న టాయ్ ఉంటుంది. ఇందులో ఉన్న చిప్స్ తింటూ తింటూ చిన్నారి పొరపాటున అందులో ఉన్న చిన్న బొమ్మను కూడా మింగేసింది. అది కాస్త గొంతులో అడ్డుపడడంతో ఊపిరాడక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది . తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పుడికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలి పోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version