ఇద్దరు టీచర్ల మధ్య అక్రమ సంబంధం..నగ్న వీడియోలతో దారుణం !

-

చదువులు చెప్పాల్సిన గురువులే… అక్రమ సంబంధాలకు తెరలేపారు. నగ్నంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసి..దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటన.. ఏపీలోని విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా రావకమతం మండలానికి చెందిన టీచర్‌ సూరెడ్డి మహేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన మరో మహిళా టీచర్‌ గత ఏడాది విజయవాడ సమీపంలో జరిగిన ట్రైనింగ్‌ సెషన్‌ కు హాజరయ్యారు.

ఆ సమయంలో ఇద్దరికీ మంచి పరిచయం ఏర్పడింది. ఉపాధ్యాయీనికి 2019లో పెళ్లి కాగా ఆమెను భర్త శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని మహేశ్వరరావు చెప్పుకున్న మహిళా టీచర్.. శారీరకంగా అతనికి దగ్గరైంది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ తరచూ లాడ్జిలు, ఫోటోలలో శారీరకంగా కలుస్తున్నారు. ఈ క్రమంలోనే లాడ్జిలో ఇద్దరూ కలిశారు. అదే సమయంలో ఆమె నిద్రిస్తుండగా సెల్ఫోన్లో నగ్న వీడియోలు మరియు ఫోటోలు మహేశ్వరరావు తీశాడు.

అప్పటి నుంచి ఆ వీడియోలను చూపిస్తూ మహిళా టీచర్ ను ఇబ్బంది పెట్టాడు. తాను రమ్మన్న చోటికి రావాలని లేకపోతే ఆ వీడియోలను బహిర్గతం చేస్తానని ఆమె ను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో చేసేదేమీ లేక… మహేశ్వరరావు చెప్పిన విధంగానే ఆ మహిళా టీచర్ వెళ్ళేది. ఇలా తన కామ వాంఛను మహేశ్వరరావు తీర్చుకుంటున్నాడు. ఇక చేసేదేమీ లేక చివరికి విజయవాడ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళా టీచర్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహేశ్వర రావు అరెస్టు చేశారు. ప్రస్తుతం విజయవాడ పోలీస్ స్టేషన్లో మహేశ్వర ఉన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version