తల్లి చనిపోయిందని 10 ఏళ్ళ పాటు గదిలోనే ఉండిపోయిన పిల్లలు, అసలు ఏం జరిగింది…?

-

గుజరాత్ లో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి చనిపోయిందని ఆమె పిల్లలు పదేళ్ళ పాటు ఒక గదిలో తమను తాము బంధించుకున్న ఘటన ఇది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ లో దాదాపు ఒక దశాబ్దం పాటు వాళ్ళు గదిలోనే ఉన్నారు. 30 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ముగ్గురు తోబుట్టువులను రక్షించినట్లు ఒక ఎన్జీఓ అధికారి చెప్పారు. ఆదివారం సాయంత్రం ఎన్జీఓ సభ్యులు ఇంటి తలుపు తెరిచినప్పుడు…

గదిలో సూర్యరశ్మికి కూడా వెళ్ళే అవకాశం లేదని గుర్తించారు. చెల్లాచెదురుగా ఉన్న ఆహారం, పత్రికలు మానవ మలాలు ఉన్నాయని పేర్కొన్నారు. “సాతి సేవా గ్రూప్ యొక్క జల్పా పటేల్ ” నిరాశ్రయుల కోసం పనిచేస్తుంది. “సోదరులు అమ్రిష్ మరియు భవేష్ మరియు వారి సోదరి మేఘనాతో సహా తోబుట్టువులు దాదాపు ఒక దశాబ్దం పాటు గదిలో తాళం వేసి ఉన్నారని వారి తండ్రి తెలిపారు” అని పటేల్ చెప్పారు.

వారు పూర్తిగా బలహీనంగా ఉన్నారని వారు సరిగా నిలబడలేని స్థితిలో ఉన్నారని వారి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ముగ్గురి తండ్రి తన పిల్లలు దాదాపు 10 సంవత్సరాల క్రితం తల్లి మరణించినప్పటి నుండి అలాంటి స్థితిలో ఉన్నారని చెప్పారు. ఎన్జీఓ సభ్యులు ఈ ముగ్గురిని బయటకు తీసుకువచ్చి శుభ్రం చేసి గుండు చేయించారు. ఈ ముగ్గురిని మెరుగైన ఆహారం మరియు చికిత్స పొందగల ప్రదేశానికి మార్చాలని యోచిస్తున్నట్లు అధికారి చెప్పారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన వారి తండ్రి తన పిల్లలు బాగా చదువుకున్నారని అన్నారు.

“నా పెద్ద కుమారుడు అమ్రిష్, 42, బిఎ, ఎల్ఎల్బి డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది, చిన్న కుమార్తె మేఘనా (39) సైకాలజీలో ఎంఏ. నా చిన్న కుమారుడు ఎకనామిక్స్ లో బిఎ చదివారు. తన భార్యకు అనారోగ్యమని… ఆ తర్వాత మరణించింది అని అక్కడి నుంచి తమను తాము బంధించుకున్నారు అని అక్కడి నుంచి బయట ఆహారాన్ని ఉంచుతా అని చెప్పాడు. “కొంతమంది బంధువులు తమపై చేతబడి చేశారని ప్రజలు అంటున్నారు” అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version