శివ.. అంటే శుభం. శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుడి అనుగ్రహం పొందడానికి మనం విశిష్టమైన రోజు మహా శివరాత్రి.. సృష్టిలో లింగస్వరూపం జ్యోతిస్పాటిక రూపంలో ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి. అయితే, ఈ శివరాత్రి పండుగ హడావిడి… రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది.
ఈ నేపథ్యంలోనే, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇక నేటి నుండి మూడు రోజులపాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో వేములవాడలో ఆర్జిత సేవలు రద్దు చేశారు అధికారులు. అటు భూపాలపల్లి కాళేశ్వరంలో నేటి నుండి మూడు రోజులపాటు శివరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. రేపు శివరాత్రి సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరుగనున్నాయి.