ప్రెగ్నెన్సీ సమయంలో సరైన ఆరోగ్యం ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రతిరోజు తీసుకునే ఆహారం పై ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాంటి ఆహార పదార్థాలు అయితే బిడ్డ ఆరోగ్యానికి హాని చేస్తాయో అటువంటి వాటికి ఎంతో దూరంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు వాళ్ళ జీవన శైలికి సంబంధించిన ప్రతి చిన్న విషయం పై ఎంతో జాగ్రత్త వహించాలి. గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో మెంతులను తీసుకోకూడదు.
ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు నుండి బిడ్డ పుట్టే వరకు మెంతులను మీ ఆహారంలో అస్సలు తీసుకోకండి. పచ్చి పుట్టగొడుగులు లో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని చేస్తుంది. కనుక ఉడికించిన పుట్టగొడుగులను మాత్రమే ఈ సమయంలో తీసుకోవడం మేలు. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినా సరే ప్రెగ్నెన్సీ సమయంలో ఇది అస్సలు తీసుకోకూడదు. పైగా దీనిని ఈ సమయంలో విషంతో సమానం అని పెద్దలు మరియు ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే బొప్పాయిను తీసుకోవడం వలన గర్భాశయ సంకోచాలకు కారణం అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక దీనిని తీసుకోకపోవడం మేలు. ప్రెగ్నెన్సీ సమయంలో పైనాపిల్ ను అస్సలు తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో మాత్రమే కాకుండా ప్రెగ్నెన్సీ చివరి వరకు దీనికి దూరంగా ఉండాలి.
అలోవెరా రసంలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయినా కూడా ఈ కలబందను ప్రెగ్నెన్సీ సమయంలో అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే దీని వలన గర్భాశయ సంకోచాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సహజంగా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించుకోవడానికి వామును ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వామును ఎక్కువగా తీసుకోవడం వలన గర్భాశయ ఉద్దీపన కలుగుతుంది. కనుక వామును గర్భిణీ స్త్రీలు తీసుకోకపోవడం మేలు. వీటితోపాటు జంక్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, చీజ్, ప్యాక్ చేసినటువంటి జ్యూస్ లు వంటి మొదలైన వాటికి ఎంతో దూరంగా ఉండడం మేలు.