మునుగోడులో అదిరిపోయే ట్విస్ట్?

-

మునుగోడు ఉపఎన్నికలో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి…ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో సత్తా చాటాలని మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. బీజేపీ ఈ పోరులో ముందు ఉందని చెప్పొచ్చు…బీజేపీ తరుపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో దిగడం ఖాయం…ఆయనకు ఉన్న ఫాలోయింగ్, టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ బలహీనపడటం బీజేపీకి కలిసిరానున్నాయి.

ఇక టీఆర్ఎస్ పార్టీలో ఇంకా అభ్యర్ధి ఫిక్స్ కాలేదు..కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సీటు ఇవ్వాలని అనుకుంటున్నారు…కానీ ఆయనకు సీటు ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ వాళ్ళే చెబుతున్నారు. అయితే అధికార బలం ఉండటం టీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చే అంశం..మరి అభ్యర్ధిగా ఎవరో ఉంటారో చూడాలి. అటు కాంగ్రెస్ లో సైతం అభ్యర్ధి ఖరారు కాలేదు. కానీ సిటింగ్ సీటుని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇలా మూడు పార్టీలు మునుగోడులో రాజకీయం నడిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.

ఇదే క్రమంలో మునుగోడుపై పట్టున్న కమ్యూనిస్టులు పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు వారు టీఆర్ఎస్ పార్టీకి గాని, కాంగ్రెస్ పార్టీకి గాని మద్ధతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆ మధ్య జరిగిన మునుగోడు సభలో రేవంత్ రెడ్డి…కమ్యూనిస్టు సోదరులు సహకరించాలని మాట్లాడారు. ఇటు టీఆర్ఎస్ సైతం కమ్యూనిస్టులని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇలా కమ్యూనిస్టుల మద్ధతు కోసం పోటీ పడటానికి కారణాలు లేవు.

మునుగోడులో కాంగ్రెస్ ఆరు సార్లు గెలిస్తే…సి‌పి‌ఐ పార్టీ ఐదు సార్లు గెలిచింది. అందుకే కమ్యూనిస్టుల మద్ధతు కోసం రెండు పార్టీలు పాకులాడుతున్నాయి. అయితే సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలు ఉమ్మడి కలిసి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. సి‌పి‌ఎం మద్ధతుతో సి‌పి‌ఐ అభ్యర్ధి పోటీలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే సి‌పి‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..మునుగోడు కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరోసారి సమావేశమై…అభ్యర్ధి విషయంలో క్లారిటీ ఇచ్చేలా ఉన్నారు. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయనున్నట్లు చర్లగూడెం, కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్‌ భూనిర్వాసితులు ప్రకటించారు. ముంపు గ్రామాలకు చెందిన 1,800 మంది మునుగోడు పోటీలో నిలబడనున్నట్లు తెలిసింది. ఇలా మునుగోడులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version