తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఒక డిఫరెంట్ స్టైల్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయనకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈయనకు అదృష్టం అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. అయితే ఇండస్ట్రీలో కూడా ఎటువంటి వాటిపైన ఎక్కువగా జోక్యం చేసుకోడు కళ్యాణ్ రామ్ తన పని ఏదో తాను చేసుకుంటూ ఉంటారు. ఇక నిర్మాతగా తన సినిమాలను తాను చేసుకుంటూ తన కెరీయన్ని ముందుకు తీసుకు వెళుతూ ఉంటాడు. కళ్యాణ్ రామ్ తన తాత మీద అభిమానంతోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ పైన ఎన్నో సినిమాలను తెరకెక్కించారు.
అయితే అలా సినిమాల ద్వారా ఎంతో నష్టం వచ్చింది కానీ తన సినిమాలను కొన్న బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టం వాటిల్లకుండా తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. ఇక ఎన్నో సంవత్సరాల గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిస్తారా సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా తను నటించిన సినిమా ట్రైలర్ కూడా విడుదల అవ్వడం జరిగింది ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా కళ్యాణ్ రామ్ బర్త్డే సందర్భంగా తన కుటుంబంతో దిగిన కొన్ని ఫోటోలు కూడా నటించ వైరల్ గా మారాయి కళ్యాణ్ రామ్ భార్య స్వాతి కుమారుడు కుమార్తె ఉన్న ఒక ఫోటో నందమూరి అభిమానుల సైతం బాగా వైరల్ గా చేశారు. కళ్యాణ్ రామ్ కుటుంబం కూడా ఎక్కడ బయట ఫంక్షన్లలో అంతగా కనిపించారు. ఇక కళ్యాణ్ రామ్ భార్య స్వాతి కూడా ఎంతో సాంప్రదాయంగానే కనిపిస్తూ ఉంటుంది. ఈమె వైద్య వృత్తిని అభ్యసించింది. ప్రస్తుతం తన భర్త పిల్లలే తన లోకం అన్నట్లుగా ఉంటుంది.