బీహార్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు నిద్రిస్తుంటే.. విద్యార్థిని గాలి విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న కొందరు టీచర్లకు.. జీతం తీసుకుంటున్నామన్న బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దానికి ఈ ఘటనే నిదర్శనం. బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగాహి పురైనా గ్రామంలోని కతర్వా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఈ ఆశ్చర్యకరమైన దృశ్యం జరిగింది.
అయితే.. కత్వరా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు నిర్లక్ష్యంగా క్లాస్ రూంలోనే నిద్రపోయింది. అంతేకాకుండా ఉపాధ్యాయురాలు నిద్రిస్తుంటే.. విసనకర్రతో ఓ విద్యార్థిని ఆమె సపర్యలు చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. అయితే.. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఉపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కామెంట్లు పెడుతున్నారు.
Video link: https://www.instagram.com/tv/CebH7BdJMPo/?utm_source=ig_web_copy_link