చర్చి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని ఉంచారు. గురువారం సాయంత్రం 4 గంటల వరకు చర్చిలోనే ప్రవీణ్ పగడాల భౌతికకాయం ఉంటుందని చర్చి వర్గాలు తెలిపాయి.
అనంతరం బాప్టిస్ట్ సమాధిలో ప్రవీణ్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, ప్రవీణ్ మృతికి రోడ్డు ప్రమాదం కారణమని పోలీసులు చెబుతుండగా.. దాని వెనుక కుట్రకోణం దాగి ఉందని క్రైస్తవ సంఘాలు, పొలిటికల్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత ఆయనపై మృతికి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.