హిందువులు అందరూ గరుడ పురాణానికి ఎంతో విలువ ఇస్తారు. అందువలన దానిలో చెప్పిన విషయాలన్నిటినీ పాటిస్తూ ఉంటారు. అయితే గరుడ పురాణాన్ని వ్యాస మహర్షి రచించడం జరిగింది మరియు 18 మహా పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. దీనిలో ఎన్నో విషయాల గురించి చెప్పడం జరిగింది మరియు కొన్ని అలవాట్లను తగ్గించడం వలన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందవచ్చు అని గరుడ పురాణం చెబుతోంది. ఈ విధంగా ఎన్నో ఫలితాలను అందజేసే గరుడ పురాణాన్ని మహాపురాణం అని కూడా పిలుస్తారు. కనుక వీటిని తప్పకుండా పాటించి జీవితంలో ఎంతో ఆనందంగా ఉండండి. గరుడ పురాణం ప్రకారం ఎప్పుడైతే ఇంటిని శుభ్రంగా ఉంచుతారో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కచ్చితంగా ఉంటుంది.
అందువలన ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా ఇంట్లో సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జీవించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి అనవసరమైన మరియు పనికిరాని వస్తువులు వంటివి తెలియకుండానే ఉంటాయి. వాటి వలన ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది. కనుక అవసరమైన వస్తువులను మాత్రమే ఇంట్లో ఉంచాలి. ఈ విధంగా అనవసరమైన వస్తువులను తొలగించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. చాలామంది స్త్రీలు ఇంట్లో వంటగదిని శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని అలానే ఉంచేస్తారు. దానివలన పని మరింత ఎక్కువవుతుంది.
పైగా శుభ్రంగా కూడా ఉండదు. ప్రతి సారి వంటగదిని ఉపయోగించిన తర్వాత వెంటనే శుభ్రం చెయ్యాలి. వంటగదిను దేవాలయంగా భావించి ఎంతో శుభ్రంగా ఉంచాలి ఎందుకంటే వంట గదిలో అన్నపూర్ణాదేవి ఉంటుంది అని చాలామంది భావిస్తారు. కనుక వంటగదిని తప్పకుండా శుభ్రంగా ఉంచాలి. ఎప్పుడైతే వంట గదిను శుభ్రంగా ఉంచరో ఎన్నో సమస్యలను జీవితంలో ఎదుర్కొంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వంట చేసిన తర్వాత చాలా శాతం మంది భోజనం చేసి ఖాళీ గిన్నెలను వంటగదిలోనే ఉంచేస్తారు. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం, జీవితంలో అశాంతి వంటి మొదలైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.