ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిరలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం మధిర పట్టణానికి చెందిన కొమ్ము దుర్గాప్రసాద్,అజయ్ ఇద్దరు అన్నదమ్ములు ద్విచక్ర వాహనంపై మధిర నుంచి బయ్యారం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మడుపల్లి గ్రామ సమీపంలో మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తమ్ముడు దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, అన్న అజయ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయం ద్వారా అజయ్‌ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పస్ట్ ఎయిడ్ అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. పట్టణ ఎస్సై ఎన్.సంధ్య ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.