బైకు ఢీకొట్టిన టిప్పర్ లారీ.. చావు బతుకుల మధ్య ఉన్నవారిపై కేసు!

-

హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిగ్నల్ పాయింట్‌కు సమీపంలో టిప్పర్ లారీని ఓవర్ టేక్ చేసి మరీ రాంగ్ రూట్‌లో వెళ్లేందుకు ఓ బైకర్ యత్నించగా.. లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ డ్రైవర్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. వెనుక కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి.

వివరాల్లోకివెళితే.. రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తున్న పి.రాహుల్ అనే విద్యార్థి.. స్నేహితునితో కలిసి వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఫ్రెండ్ బండి మీద హైదరాబాద్‌కు వచ్చి తిరిగి క్యాంపస్ హాస్టల్‌కు వెళుతున్నాడు. ఈ క్రమంలో దుర్గానగర్ చౌరస్సా వద్ద (ఆరాంఘర్) వీరి వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. అయితే, యాక్సిడెంట్ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ ప్రమాదంలో యువకులదే తప్పని తెలుస్తోంది. టిప్పర్ డైవర్ ఫిర్యాదు మేరకు రాహుల్, (బండి పై వెనక సీటులో కూర్చున్న) మనోహర్ మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news