తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు రంగులతో కొత్త రేషన్ కార్డులు రానున్నాయని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు తీసుకునే బీపీఎల్ కుటుంబాలకు మూడు రంగుల కార్డు, ఏపీఎల్ కుటుంబాలకు ఆకుపచ్చ రంగు కార్డులు ముద్రించి ఇస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లబ్దిదారుల జాబితాలో మీ పేరు ఉంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి సన్న బియ్యం తీసుకోవచ్చు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు.