ముగ్గురి అఘాయిత్యం…గర్భం దాల్చిన మైన‌ర్ బాలిక

-

దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌‌ల‌పై లైంగిక‌దాడుల పరంప‌ర‌ కొన‌సాగుతూనే ఉంది.. మొన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌థ్రాస్ లో జ‌రిగిన ఘ‌టనపై దేశ‌వ్యాప్తంగా ఆగ్ర‌హావేశాలు పెల్లుబుకాయి. ఇది మ‌రిచిపోక ముందే ముందే తెలంగాణ‌లోని ఖ‌మ్మంలో మ‌రో ఘ‌ట‌న వెలుగు చూడ‌టం క‌ల‌క‌లం రేపింది. త‌న కోరిక తీర్చ‌లేద‌ని మైన‌ర్ బాలిక‌పై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని నవసరి జిల్లాలో వ్యవసాయ కూలీ కుమార్తె అయిన 12 ఏళ్ల బాలికపై తన ముగ్గురు దాయాదులైన బాలురు గడచిన ఐదు నెలలుగా లైంగిక‌దాడి చేస్తున్నారు. దీంతో 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కాగా నిందితులంతా 18ఏళ్ల వయసులోపు వారే కావ‌డం గ‌మ‌నార్హం.

కొన్ని రోజుల క్రితం బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వైద్యులు ఆమెను ప‌రీక్షించి బాలిక నాలుగు నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో బాలికను చికిత్స కోసం మరో ద‌వాఖాన‌కు తరలించారు. కాగా పోలీసులు ఆసుపత్రికి వచ్చి బాలికతోపాటు ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ముగ్గురు బాలురపై కేసు నమోదు చేశామని వారు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version