ఫోన్‌ మాట్లడొద్దని మందలించిన ఆత్త…నవ వధువు ఆత్మహత్య

-

ఫోన్‌ ఎక్కువగా మాట్లాడొద్దని ఆత్త మందలించినందుకు ఓ కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌ లోని ఎస్సార్‌ నగర్‌ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సికింద్రాబాద్‌ కు చెందిన శిల్ప అనే అమ్మాయికి.. బోరబండకు చెందిన పవన్‌ కుమార్‌ కు మూడు నెలల కిందట పెళ్లి జరిగింది. ఈ వివాహం రెండు కుటుంబాల సమక్షంలోనే జరిగింది.

అయితే.. ఇటీవలే నవ వధువు శిల్పకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. దీంతో ఆ కుటుంబంలో నూతన ఉత్సాహం వచ్చింది. కానీ.. ఇంతలోనే.. కోడలి ఆత్మహత్య.. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నవ వధువు శిల్ప కు ఎప్పుడూ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫోన్‌ మాట్లాడటం బాగా ఇష్టం.

పెళ్లి అయినప్పటి నుంచి ఎప్పుడూ ఫోన్‌ లోనే మాట్లాడేది శిల్ప. అయితే.. ఈ విషయం నచ్చని.. ఆమె ఆత్త కోడలు శిల్పను మందలించింది. దీంతో చాలా సున్నిత మనస్కురాలైన శిల్ప.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ విషయం తెలిసిన శిల్ప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version