ట్రిపుల్ ఆర్ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి 10 రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలిపింది. ట్రిపుల్ ఆర్ సినిమాకు రూ.336 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. భారీ బడ్జెట్ సినిమాకు మొదటి మూడు నాలుగు రోజుల్లోనే కలెక్షన్లు వచ్చేట్లు డిస్ట్రిబ్యూటర్లు టికెట్ ధరలు పెంచుకుంటారని.. ఇదే సమయంలో ప్రజలపై కూడా ఎక్కువ భారం పడకుండా చూడటం ప్రభుత్వం విధి అని ఆయన అన్నారు.
ట్రిపుల్ ఆర్ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్…. టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్
-