చితి మంటలపై రొట్టెలు కాల్చిన యువకుడు.. వీడియో వైరల్!

-

వినాశకాలే విపరీతబుద్ది.. అనడానికి మరొక సజీవ సాక్ష్యం లభ్యమైంది. ఆధునిక యుగంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తూ తోటి వారిని ఆశ్చర్యానికి, భయాందోళనకు గురిచేస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. మనిషి పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అన్నట్టుగా ఓ యువకుడు ఏకంగా శవం కాలుతున్న చితి మీద రొట్టెలు కాలుస్తుండటం అందరినీ షాక్‌కు గురిచేసింది.

ఏకంగా చితి మంటలపై పెనం పెట్టి రోటీని కాల్చుతున్నాడు.వంట చేయడానికి అవసరమైన పాత్రలు కూడా పక్కనే కనిపిస్తున్నాయి. ఉండేందుకు చితి పక్కనే ఓ టెంట్ కూడా వేసుకున్నాడు. అతనికి మతిస్థిమితం సరిగ్గానే ఉందా? లేదా అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. ఆ యువకుడి చేష్టలను ఓ వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. కాగా, ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news