న్యూ ఇయర్ -2025 వేడుకల సందర్బంగా మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియోస్ కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి వాహనాలను ర్యాష్‌గా నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చాలా మంది పట్టుబడ్డారు. వారిలో కొందరు పోలీసుల మాట వినకుండా వారిని ముప్పు తిప్పలు పెట్టినట్లు సమాచారం.
బ్రీత్ అనలైజర్ టెస్టుకు సహకరించకుండా ఫోన్ చేసుకోవాలని, మాట్లాడుకుందామని ఇలా పలుమార్లు పోలీసులను ఇబ్బందులకు గురిచేశారు. మరికొందరు ఏకంగా తామేమీ తప్పు చేయలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కొందరు యువకులతో పాటు ఫ్యామిలీ పర్సన్స్ సైతం డ్రంకెన్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. పలువురైతే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వాహనాలతో విన్యాసాలు చేస్తూ.. యువకులు హల్చల్ చేశారు. pic.twitter.com/40qD3JuZc1
— ChotaNews App (@ChotaNewsApp) January 1, 2025