రూ.500 పందెం కోసం.. యమునా నదిలో దూకాడు ఓ యువకుడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్రెండ్స్ తో పందెం కాసి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న యమునా నదిలోకి దూకి గల్లంత్తయ్యాడు 21 ఏళ్ల యువకుడు.

దీంతో యువకుడి ఆచూకీ కోసం గాలిస్తోంది రెస్క్యూ టీమ్స్. కాగా యమునా నది నీటి మట్టం..అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల యమునా నదికి భారీగా వచ్చి చేరుతోంది వరద నీరు. 206 మీటర్లు దాటి ప్రవహిస్తోంది యమునా నది. వరద పరిస్థితిని అంచనా వేస్తూ, లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
రూ.500 పందెం.. యమునా నదిలో దూకిన యువకుడు
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఘటన
ఫ్రెండ్స్ తో పందెం కాసి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న యమునా నదిలోకి దూకి గల్లంతైన 21 ఏళ్ల యువకుడు
యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్న రెస్క్యూ టీమ్స్ pic.twitter.com/FU4LgXippV
— BIG TV Breaking News (@bigtvtelugu) September 4, 2025