శ్రీవారి భక్తులకు నాణ్యమైన సేవలను అందించడానికి టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీవారి సేవకులు, గ్రూప్ సూపర్వైజర్లకు నిరంతరం శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ వెబ్సైట్ లో ట్రైనర్ మాడ్యూల్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందించే జనతా, బిగ్ క్యాంటీన్లను కేటాయించినట్లుగా తెలుస్తోంది. నకిలీ దర్శన టికెట్లు, వసతి కోసం ప్రలోభ పెడితే 0877-2263828 నెంబర్ కు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు.

కాగా, తిరుమలలో శ్రీవారి సేవకుల శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. సేవలో సంస్కరణల భాగంగా ఐఐఎం అహ్మదాబాద్, రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో శిక్షణ అందించనున్నట్లుగా వెల్లడించారు. త్వరలోనే ప్రొఫెషనల్స్, ఎన్ఆర్ఐ లకు కూడా సేవ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రోజుకు నాలుగు లక్షలకు పైగా లడ్లు తిరుమలలో విక్రయమవుతున్నాయని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.