బడి మానేసిన బతుకులకు భరోసానిస్తున్న యువతి..

-

జీవితం అందిరికీ ఒకేలా ఉండదు. బాల్యంలో అన్నీ మదురజ్ఞాపకాలే కాదు.. కొన్ని చేదు ఘటనల వల్ల బడిమానేసి పనిలోకి దిగాల్సి వస్తుంది. మనదేశంలో ఎంతో మంది.. చదువును మధ్యలోనే ఆపేసి.. ఎండలో కాయకష్టం చేస్తున్నారు. ఇలాంటి వారు ఇక జీవితం మొత్తం ఏదో ఒక పనిచేసుకుంటూ బతకాల్సిందే.. ఒక నిర్ధిష్టమైన జాబ్ ఉండదు. వందకు రెండొందలకు ఏదో ఒకటి చేస్తుంటారు. వారి గురించి పట్టించుకునే వారు ఎవరూ ఉండరూ.. కానీ ఇలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చిందో అమ్మాయి. అరుదైన రంగంలోకి అడుగుపెట్టి… బడి స్థాయిలోనే చదువుకు దూరమయ్యే వారికి ప్లంబింగ్‌ వంటి పనులు నేర్పి, ఉపాధి దొరికేలా చేస్తోంది.

ఆమె పేరు శతాబ్ధి.. తండ్రి పోస్టుమాష్టర్.. తల్లి గృహిణి. ఉండేది ఒడిశా. 27 ఏళ్ల శతాబ్ది శుభస్మిత సివిల్‌ ట్రేడ్‌లో డిప్లొమా తర్వాత సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసింది. ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు ఓ దినపత్రికలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా ప్రకటన కనిపించింది. ప్లంబింగ్‌, వైర్‌ బైండింగ్‌లో శిక్షణనివ్వడంలో ఆసక్తి ఉన్న వారిని దరఖాస్తు చేసుకోవాలని ఉంది. ఆ ఉద్యోగం గురించి తెలుసుకున్న శతాబ్దికి చాలా ఆసక్తి అనిపించింది. ఇలాంటి రంగంలోకి మహిళలు అడుగుపెట్టడం చాలా అరుదు. తను దీన్ని ఎంచుకోవడంలో మొదట తల్లిదండ్రులు కాస్త సంకోచించినా.. తర్వాత ఒప్పుకున్నారు. అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ‘ద ఇండియన్‌ ప్లంబింగ్‌ స్కిల్స్‌ కౌన్సిల్‌’లో శిక్షకురాలిగా ఎంపికైంది.

జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో భాగంగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. గ్రామీణ పేద యువతకు నైపుణ్యాలను ఇచ్చి ఉపాధికి తోడ్పడటమే ఈ పథకం యొక్క ముఖ్యోద్దేశం. తమ వద్దకు వచ్చేవారిలో పాఠశాల స్థాయిలో చదువు ఆపేసినవాళ్లే ఎక్కువ ఉంటారట.. తరగతిలో చెబుతున్న అంశంపై ఏకాగ్రత చూపించరు. అటువంటి వారికి ఆసక్తిని కలిగించి నేర్పించడం ఓ సవాల్ లాంటిదే…

35 మందిని ఓ బృందంగా చేసి తరగతులు నిర్వహిస్తుంటారు.. ఈ ఏడేళ్లలో 750 మందికి శిక్షణ ఇచ్చారట.. వీరికి స్థానికంగానే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ఉద్యోగాలను ఇప్పించే ప్రయత్నం చేస్తుంటామని శతాబ్ధి అంటోంది.. వీరిలో చాలా మంది నెలకు రూ.10 – 15 వేలు సంపాదించుకుంటూ ఉంటారు.

మరి కొందరు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లంబర్స్‌గా స్థిరపడ్డారు. ఎప్పుడైనా ఎదురు పడితే వారు చెప్పే కృతజ్ఞతలు తమకు చాలా సంతోషాన్ని అందిస్తాయి అంటోంది ఈ అమ్మాయి.. సహ విద్యార్థులందరూ పెద్ద పెద్ద సంస్థల్లో చేరితే, తను ఇలా రావడం చాలా మందికి నచ్చలేదు.మన కెరియర్‌ను మనం చూసుకుంటే ఉన్నత స్థాయికి చేరుకుంటామేమో. కానీ చదువూ లేక ఎటూ కాని స్థితిలో ఉన్న యువత పరిస్థితి ఏంటి? అందుకే ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నా అని గర్వంగా చెబుతోంది శతాబ్ధి.. బడి మానేసి లేదా చదివే స్థోమత లేక ఖాళీగా ఉన్న పిల్లలను ఎంపిక చేసుకుని… ఆసక్తి చూపని వారికి అవగాహన కలిగించి శిక్షణకి హాజరయ్యేలా చేస్తారట..

మనం కూడా.. చదువు.. అది అవ్వగానే జాబ్.. మంచి శాలరీ చాలు. ఇతరులు గురించి ఆలోచించే టైం, ఓపిక మనకు ఉండదు. ఇలా ఇతరులు గురించి ఆలోచించే వారు చాలా తక్కువగా ఉంటారు కదా.!

Read more RELATED
Recommended to you

Exit mobile version