ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో ఎలా అయినా గెలిచేందుకు అభ్యర్ధులు నానా తంటాలు పడుతున్న్నారు. ఎలా అయినా అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు చేయాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో కమలాపురం మండలం పాచికలపాడు పంచాయతీ ఏకగ్రీవం అయింది. సర్పంచ్ పదవికి ఇరవై లక్షలు ఇస్తానని వైసీపీ మద్దతుదారుడు ప్రకటించాడు.
ఆ మొత్తాన్ని ఒక్కో ఓటరుకు ఎనిమిది వేల రూపాయలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఈ పాచికలపాడు పంచాయతీ పోటీ లేకుండా ఏకగ్రీవం అయింది. ఏకంగా ఓటుకు ఎనిమిది వేలు అనేది ఆసక్తి కరంగా మారింది. ఆ రేంజ్ లో అమౌంట్ పెడుతున్నారు అంటే డిమాండ్ ఎంతలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా దాదాపు అలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి.