ఎర్రబెల్లి దయాకర్ చిలక జ్యోతిష్యం చెపుతున్నాడు : ఆది శ్రీనివాస్

-

ఎమ్మెల్యేగా ఓడిపొయిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు చిలక జ్యోతిష్యం చెపుతున్నాడు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అయితే ఎర్రబెల్లి కి అంతగా జ్యోతిష్యం తెలిస్తే ఫాంహౌస్ లో పడుకున్న కేసీఆర్ ఎప్పుడు లేస్తాడో చెప్పాలి. ఫార్ములా ఈ రేస్ కేసు లో కేటీఆర్ ఎప్పుడు జైలు కు పోతాడో చెప్పాలి అన్నారు. ఇక నలభై ఏళ్లు రాజకీయాల్లో ఉండి చిన్న అమ్మాయి చేతిలో చిత్తు గా ఓడిపోయినా సిగ్గు రాలేదా అని అడిగారు.

ఇక బీఆర్ఎస్ లో ఉన్న ఎర్రబెల్లి కి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తున్నాయి. మా ఎమ్మెల్యేలు గురించి ఎర్రబెల్లి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీ వాళ్లు10 మంది పోయారు. మిగిలిన వారినైనా కాపాడుకో. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ను ఓర్వలేకనే ఎర్రబెల్లి విమర్శలు చేస్తున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ ఒకే సారి చేసిన ప్రభుత్వం మాది. మా ప్రభుత్వం స్థిరంగా ఉంది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో ఉండి రాహుల్ గాంధీ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అని పేర్కొన్నారు ఆది శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version