రామరాజ్యం కేసుకు సంబంధించి వీర రాఘవరెడ్డి అరెస్ట్ లో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తాను శివుడి అవతారం అని క్రియేట్ చేసుకున్న వీర రాఘవరెడ్డి.. శివుడి అవతారం ధరించాను అంటూ రామరాజ్యం లో రిక్రూట్మెంట్ మొదలుపెట్టాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రామా రాజ్యంతోనే సాధ్యం అని వీడియోలు చేయడం మొదలు పెట్టాడు.
అయితే వీర రాఘవరెడ్డిని అరెస్టు చేయటానికి గల కారణాలను పేర్కొన్నారు పోలీసులు. రామరాజ్యం పేరుతో దోపిడీ చేస్తున్నారు. పుజారుల పై భైతిక దాడులు చేస్తున్నారు అని చెప్పిన పోలీసులు.. వీర రాఘవరెడ్డికి గతంలోనూ నేర చరిత్ర ఉంది. ఒకవేళ వీర రాఘవరెడ్డిని అరెస్టు చేయకుండా ఉంటె శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది అని అన్నారు. వీర రాఘవరెడ్డి పై 2015, 2016 లోనే కేసులు ఉన్నాయి. చిలుకూరు రంగరాజన్ కు ఉగాది వరకు సమయం ఇస్తున్నామని వీర రాఘవరెడ్డి బెదిరించాడు అంటూ పోలీసులు పేర్కొన్నారు.