ఇంటర్వ్యూలోనే ఏడ్చేసిన అమీర్‌ఖాన్‌.. ఎందుకంటే..?

-

బాలీవుడ్‌ మిస్టర్ ఫర్ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసిన సినిమాల్లో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ హిట్లు ఉండటమే కాకుండా.. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలు కూడా ఆయనవే ఉండటం విశేషం. అయితే.. ఇటీవల లాల్‌సింగ్‌ చడ్డా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు అమీర్‌ఖాన్. అయితే.. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్న సంఘటన చోటు చేసుకుంది. ‘హ్యుమన్స్ ఆఫ్ బాంబే’ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఫీజులు కట్టలేని పరిస్థితిలో పాఠశాలలో అవమానాలు ఎదుర్కొన్న విషయాన్ని పంచుకున్నారు అమీర్‌. తమ కుటుంబం తీవ్ర అప్పుల్లో ఉండి, ఎనిమిదేళ్ల పాటు గడ్డు పరిస్థితులను చూసినట్టు చెప్పారు అమీర్‌.

స్కూల్లో ఆరో తరగతికి రూ.6, ఏడో తరగతికి రూ.7, ఎనిమిదో తరగతికి రూ.8 ఫీజు ఉండేదని చెప్పాడు అమీర్‌. అమీర్, ఆయన సోదరులు, సోదరీమణులు ఎప్పుడూ సమయానికి ఫీజులు చెల్లించే వారు కాదని, దీంతో వారిని
ఒకటి, రెండు సార్లు హెచ్చరించిన అనంతరం స్కూల్ అసెంబ్లీలో (ప్రేయర్ సందర్భంగా) ప్రిన్సిపల్ వారి పేర్లను పెద్దగా చదివేవారట. ఈ విషయాన్ని ఆయన చెప్పిన సందర్భంగా కన్నీరు ఆపుకోలేకపోయారు. నిర్మాత తాహిర్ హుస్సేన్, జీనత్ హుస్సేన్ దంపతులకు అమీర్ ఖాన్ సంతానం. అమీర్ కు ఒక అన్నయ్య ఫైసల్ ఖాన్, ఇద్దరు అక్కలు ఫర్హత్ ఖాన్, నిఖత్ ఖాన్ ఉన్నారు. అమీర్ ఖాన్ 1973లో వచ్చిన యాదాన్ కి బారాత్ సినిమాలో బాల నటుడిగా కనిపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version