మహేష్ బాబు చేతుల మీదుగా “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” మూవీ ట్రైలర్

-

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసే హీరో సుధీర్ బాబు. మరోవైపు ఒకసారి తనకు కరెక్ట్ అయితే వరుస పెట్టి వాళ్లతోనే సినిమాలు చేసే దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు వస్తున్న సినిమా ” ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఇద్దరి కలయికలో వచ్చిన సమ్మోహనం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన వి ఓటీటీలో రిలీజ్‌ అయింది. అయితే.. ఇందులో సుధీర్‌ బాబును ప్యాక్డ్‌ బాడీలో చూపించిన విధానం అందరికీ నచ్చింది.

ఇప్పుడు వీరి కాంబినేషన్‌ లో రూపొందితున్న మూడో సినిమానే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇందులో హీరో సుధీర్‌ బాబు సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్ర ఇదే కావడం గమనార్హం. అయితే.. ఇప్పటికే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, సాంగ్స్‌ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్టేట్‌ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ రేపు సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్‌ కానుంది. ఈ ట్రైలర్‌ ను మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్‌ కానుంది. కాగా ఈ మూవీని సెప్టెంబర్ 16వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version