డ్యాన్సింగ్ కింగ్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా..బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న సంగతి అందరికీ తెలుసు. హీరోగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా పలు విభాగాలపై ఆయనకు పట్టుంది. తెలుగులో సూపర్ హిట్ ఫిల్మ్స్ లో సాంగ్స్ కు కొరియోగ్రాఫర్ గా పని చేసిన ప్రభుదేవాను.. తెలుగులో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగులో స్టార్ హీరోలు చిరంజీవి, రాజశేఖర్, వెంకటేశ్, బాలకృష్ణతో పాటు పలువురి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ కు కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా పని చేశారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఫిల్మ్ లో ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ సాంగ్ కు స్లో స్టెప్స్ కంపోజ్ చేసి ట్రెండ్ సెట్ చేశాడు ప్రభుదేవా. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
అప్పుడే ప్రభుదేవాలోని టాలెంట్ ను గుర్తించాడు కె.రాఘవేంద్రరావు. ఇక ఆ తర్వాత రాఘవేంద్రరావు ప్రభుదేవాను హీరోగా తెలుగులో పరిచయం చేశాడు. ‘లవ్ స్టోరి 1999’ ఫిల్మ్ ద్వారా ప్రభుదేవా తెలుగులో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో ప్రభుదేవా నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.
ఈ సినిమాలో రెండు పాటలకు ప్రభుదేవాను కొరియోగ్రఫీ చేసుకున్నారు. ఇక అప్పటికే ప్రభుదేవా ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘ప్రేమికుడు’ ఫిల్మ్ చేశాడు. ఆ పిక్చర్ సూపర్ హిట్ అయింది. అయితే, తనకు రాఘవేంద్రరావు కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టమని, ‘పెళ్లి సందడి’ చిత్రంలోని పాటలన్నీ తనకు చాలా ఇష్టమని ప్రభుదేవా ఓ సందర్భంలో చెప్పారు.