కమిషనరాఫ్ ఎంక్వైరీస్ వద్ద ఏబీ వెంకటేశ్వరరావు విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సీనియర్ ఐపీఎస్ ఏబీవీ సంచలన కామెంట్లు చేశారు. తన కేసు విషయంలో కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారన్న ఏబీవీ, వైఎస్ వివేకా మరణం ప్రమాదశావత్తూ జరిగిందనడం ఎంత నిజమో.. నాపై ఆరోపణలు కూడా అంతే నిజం అని అన్నారు. కుట్ర పన్ని నన్ను ఇరికించేందుకు కృత్రిమ డాక్యుమెంట్లు కూడా సిద్దం చేశారని, కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారనే దానికి సాక్ష్యాలున్నాయని అన్నారు.
కృత్రిమ డాక్యుమెంట్ల సృష్టించారని విచారణాధికారి దృష్టికి తీసుకెళ్లానని కృత్రిమ డాక్యుమెంట్ల వ్యవహరంపై ప్రభుత్వం విచారణ చేయాలని అన్నారు. నేనే 21 మంది సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేశానని కొందరు సంతృప్తికరంగా చెప్పారు.. కొందరు వాళ్లకు నచ్చినట్టు చెప్పారని అన్నారు. అల్పులు అధములు.. కుక్కమూతి పిందెలు చట్టాలు తెలియని వాళ్లు నాపై ఆరోపణలు చేశారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 14 రోజుల నుంచి విచారణ కొనసాగుతోందని అన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన విచారణాధికారి నివేదిక కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.