ఐశ్వర్య పై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన అభిషేక్

-

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్  తాజాగా తన సతీమణి, నటి ఐశ్వర్యారాయ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుటుంబం విషయంలో ఆమె ఎంతగానో సపోర్ట్ చేస్తుందని అన్నారు. ఆమె వల్లే తాను సినిమాలపై పూర్తి దృష్టి పెట్టగలుగుతున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. “నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్నానంటే అది నిజంగానే నా అదృష్టం.

మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలు చూసుకుంటూ ఐశ్వర్య ఇంట్లోనే ఉంటుంది. ఆ విషయంలో తనకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఇప్పుడున్న రోజుల్లో ఈ విషయం పిల్లలకు కూడా అర్థమవుతోంది. వారు కూడా తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నారు. కుటుంబం విషయంలో ఐశ్వర్య సపోర్ట్ చేయడం వల్లే నేను సినిమాలపై పూర్తిగా దృష్టిపెట్టగలుగుతున్నా” అని తెలిపారు. మరోవైపు వీరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version