పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

-

తీవ్ర సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన  అంశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును సోమవారం తెలంగాణ హైకోర్టు రిజర్వు చేసింది. లగచర్ల దాడి ఘటనలో బోంరాస్ పేట పోలీసులు 3 ఎఫ్ఎస్ఐఆర్ లు నమోదు చేశారు. ఒకే ఘటన పై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

patnam narendhar reddy

రాజకీయ 80 కక్షలతోనే ఈ కేసులు నమోదు చేశారని ఒక దాని తర్వాత మరొకటిగా నుంచి బయటకు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒకే నేరం పై పలు ఎఫ్ఎస్ఐఆర్ లు నమోదు చేయరాదంటూ గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా పిటిషనర్ ప్రస్తావించారు. ఈ పిటిషన్ పై ఇవాళ న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఒకే ఘటనపై వేర్వేరు కేసులు పెట్టవద్దని సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్ ప్రస్తావించగా దాడి ఆధారంగానే పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారని, కేసుల వివరాలను ఏఏజీ రజనీకాంత్ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version