ఆ ప్రొడ్యూసర్ కారణంగా చంటి సినిమాను మిస్ చేసుకున్న రాజేంద్రప్రసాద్…!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్ లలో కెఎస్ రామారావు ఒకరు. ఈ నిర్మాత క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పేరు మీద ఎన్నో చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే ఆయన తెరకెక్కించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. కెఎస్ రామారావు తెరకెక్కించిన సినిమాలలో ప్రేక్షకుల నుండి మంచి ప్రజాదరణ పొంది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో చంటి సినిమా ఒకటి. వెంకటేష్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ‘చంటి’ 1992 జనవరి 10 వ తేదీన విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా 30 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా కేఎస్ రామారావు ఈ మూవీ గురించిన అనేక విశేషాలను గుర్తు చేశారు. తమిళంలో ప్రభు హీరోగా దర్శకుడు పి.వాసు చేసిన ‘చిన్నతంబి’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ మూవీని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని నేను .. రవిరాజా పినిశెట్టి అనుకున్నాము. రాజేంద్రప్రసాద్ తో పాటు కొంత మంది పేర్లను పరిశీలించాము.

ఆ సమయంలో సురేష్ బాబు గారు ఈ మూవీని వెంకటేష్ తో చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. వెంకటేష్ డేట్స్ ఇస్తే చెయ్యడానికి నేను రెడీ అని చెప్పాను. ఆ తర్వాత సినిమా పనులన్నీ చకచకా జరిగిపోయాయి. వెంకటేష్, చంటి పాత్ర కోసం చాలా కసరత్తు చేశాడు. నిజానికి అప్పటి వరకు వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ఎక్కువగా ఉండేది. పర్ఫామెన్స్ పరంగా చంటి సినిమా వెంకటేష్ కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇక చంటి సినిమాలో మీనా కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమా తర్వాత మీనా ఎంత పెద్ద నటిగా ఎదిగిందో మన అందరికీ తెలిసిందే. తమిళ్ లో వచ్చిన ‘చిన్న తంబి’ సినిమా కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించడం విశేషం. ఇప్పటికి కూడా ‘చంటి’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అది ఆ సినిమా గొప్పతనమే అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version