ఇండియాలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య చూస్తే 35 వేలకు పైగానే నమోదు అయ్యాయి. మరోవైపు వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. రోజురోజుకీ లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నా కానీ కొంతమంది సరిగ్గా పాటించకపోవడం తో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి.
పక్క దేశాలలో మరియు యూరప్, అమెరికా దేశాలలో కనబడుతున్న పరిస్థితి చూసి చాలా వరకు దేశంలో ఇటువంటి పరిస్థితి తమ కుటుంబాల్లో రాకుండా ఉండడానికి లాక్ డౌన్ పొడిగించినా ఫర్వాలేదన విధంగా ప్రజలు సహకరిస్తున్నారు. ఓవరాల్ గా ఇండియాలో రోజురోజుకి కేసులు పెరుగుతుండటం, మరణాల సంఖ్య పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగించే విషయం కావడంతో, ప్రజలు కేంద్ర ప్రభుత్వం మూడో దశ లాక్ డౌన్ చేపట్టిన సహకరించడానికి రెడీ గానే ఉన్నారు. మరి పాలకులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.