ఈఎస్‌ఐ కుంభకోణం తవ్వినా కొద్దు తరగని ఇసుకలా మారుతుంది. ఈ కేసులో అధికారులు ఎంత సమగ్ర విచారణ చేస్తున్నారో అన్నీ కొత్తకొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో 150 కోట్ల అక్రమాలు జరిగాయని తెలిసిన విషయమే కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే అంతకన్నా ఎక్కువే కుంభకోణం జరిగిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటివరకే 9 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తాజాగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాంతో అరెస్ట్ అయిన వారి సంఖ్య 10 కి చేరుకుంది.
వివరాల్లోకి వెళితే… విజయవాడ భవానీపురంలో తిరుమల మెడికల్ ఏజెన్సీని నిర్వహిస్తున్న తెలకపల్లి కార్తీక్ కు ఈ కుంభకోణంలో భాగం ఉందని అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు, కోర్టు అతనికి నేటి నుండి 14 రోజుల పాటు రిమాండ్ ను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆయనను విజయవాడ లోని సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులు ప్రముఖ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో ప్రస్తుతం తెలకపల్లి కార్తీక్ ను అరెస్ట్ చేయడంతో ఈ కేసులు అరెస్ట్ చేసిన వారి సంఖ్య పదికి చేరింది.