పక్క ఆధారాలతోనే అచ్చెన్న అరెస్ట్ : ఏసీబీ జాయింట్ డైరెక్టర్..!

-

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అక్కడక్కడ నిరసనలు జరుగుతున్నాయి. ఆ పార్టీ నేతలు అధికాపక్షంపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడిని ఈ ఉదయం 7.30కి అదుపులోకి తీసుకున్నామని, ఈఎస్‌ఐ స్కామ్‌లో సుమారు 150 కోట్లు అక్రమాలు జరిగాయని వివరించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించినట్టు నిర్ధారణ జరిగిందన్నారు. అలాగే ఫేక్ ఇన్వాయిస్‌ తో మందులు కొనుగోలుకు పాల్పడ్డారని చెప్పారు. అచ్చెన్నాయుడు కనీసం ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా తెలియకుండా కొన్ని ప్రక్రియలు చేశారన్నారు. విజిలెన్స్ రిపోర్ట్‌పై ప్రభుత్వ అదేశాలుపై  ఏసీబీ కేసు విచారణ చేస్తూ అరెస్ట్ చేసినట్లుగా  ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. అచ్చెన్నాయుడితో పాటు సీకే రమేష్, జి.విజయకుమార్, డాక్టర్ జనార్దన్, ఈ. రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరందరిని ఈరోజు విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version