పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పట్టణానికి చెందిన సతీశ్, సాత్విక్ దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. తండ్రీకొడుకులు సతీశ్, సాత్విక్ మరో ఇద్దరు కలిసి కారులో హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు పట్టణ శివారులోని గాంధీనగర్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సతీష్, అతడి కుమారుడు 11 నెలల సాత్విక్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు స్పాట్‌కు చేరుకుని గాయపడిన వారిన చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.తోటి ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.