హైదరాబాద్ మహానగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా విపరీతంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు అటు ట్రాఫిక్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇరుకు రోడ్లు, విపరీతంగా వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన వలన ప్రమాదాలు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా గ్రేటర్ లోని మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూల్లో తన కూతురు(10)ను డ్రాప్ చేయడానికి యాక్టివా పైన తండ్రి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి లారీ యాక్టివాను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ కిందపడి కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం
స్కూల్లో కూతురు(10)ను డ్రాప్ చేయడానికి యాక్టివా పైన తండ్రి తీసుకెళ్తుండగా ప్రమాదం
వేగంగా వచ్చి యాక్టివాను ఢీకొట్టిన లారీ
లారీ కిందపడి కూతురు అక్కడికక్కడే మృతి.. తండ్రికి స్వల్ప గాయాలు pic.twitter.com/3jDe9p4t5r
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2025